ద్విత్వాక్షరాలు, సంయుక్తాక్షరాలు, సంశ్లేషక్షరాలు
ఒక హల్లునకు అదే హల్లు యొక్క ఒత్తు వచ్చి చేరితే దానిని 'ద్విత్వాక్షరము' అంటారు.
ఉదా : క్క, ఖ్ఖ, గ్గ, ఘ్ఘ, చ్చ, ఛ్ఛ,
జ్జ, ఝ్ఝ, ట్ట, ఠ్ఠ, డ్డ, ఢ్ఢ, ణ్ణ,
త్త, థ్థ, ద్ద, ధ్ధ, న్న, ప్ప,
ఫ్ఫ, బ్బ, భ్భ, మ్మ, య్య, ర్ర,
ల్ల, వ్వ, శ్శ, ష్ష, స్స, హ్హ,
ళ్ళ, ఱ్ఱ.
ఉదా : అమ్మ, నాన్న, అక్క, చెల్లి, అన్న, తమ్ముడు.
సంయుక్తాక్షరాలు : ఒక హల్లుకు వేరొక హల్లు యొక్క ఒత్తు వచ్చి చేరితే దానిని 'సంయుక్తాక్షరము' అంటారు.
ఉదా : క్ర, ఖ్య, గ్మ, చ్న, జ్వ, ట్ల, డ్ర, ణ్య, త్న, గ్థ, ద్వి న్మ, ప్ల, బ్ర, భ్య, మ్ల, ర్క, ల్వ, వ్య, శ్ర ష్ఠ, స్వ, హ్మ, ళ్వ.
ఉదా : క్రమము, ముఖ్యము, రుగ్మత, వ్యవసాయము.
సంశ్లేషక్షరాలు : ఒక హల్లునకు వేరొక రెండు హల్లుల యొక్క ఒత్తులు వచ్చి చేరితే దానిని 'సంశ్లేషక్షరాలు' అంటారు.
ఉదా : క్రమము, ముఖ్యము, రుగ్మత, వ్యవసాయము.
సంశ్లేషక్షరాలు : ఒక హల్లునకు వేరొక రెండు హల్లుల యొక్క ఒత్తులు వచ్చి చేరితే దానిని 'సంశ్లేషక్షరాలు' అంటారు.
త్ర్య, ష్ట్ర, త్స్న, స్త్రీ, స్కృ.
ఉదా : స్వాతంత్ర్యము, రాష్ట్రము, జ్యోత్స్న, సంస్కృతము.
Comments
Post a Comment